- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP | కృష్ణా జిల్లా గన్నవరం శివారులో హైవేపై ప్రమాదం
ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ఒక రోడ్డు ప్రమాదం మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం (Road Accident) వెలుగు చూస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. ఒక రోడ్డు ప్రమాదం మరువక ముందే మరో రోడ్డు ప్రమాదం (Road Accident) వెలుగు చూస్తోంది. వాటిల్లో ఎక్కువ శాతం బస్సు ప్రమాదాలు జరగడం ప్రయాణికుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నిన్న కృష్ణా జిల్లా గన్నవరం (Gannavaram) వద్ద రెప్పపాటులో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తప్పగా.. అది మరువక ముందే గన్నవరం శివారులో హైవేపై మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విజయవాడ నుంచి శ్రీకాకుళంలోని పెళ్ళికి వెళ్లొస్తున్న ఓ పెళ్లి బృందంతో ఉన్న బస్సు గన్నవరంలోని చెన్నై-కోల్ కత్తా హైవేపై ప్రయాణిస్తోంది. గన్నవరం వే బ్రిడ్జి వద్ద ముందున్న లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో దాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంగా కొంత మేర దెబ్బతింది. బస్సు డ్రైవరుతో పాటు బస్సులోని ప్రయాణికులు కొంత గాయపడ్డారు. ఇదే ప్రమాదంలో బస్సును కారు వెనక నుంచి ఢీకొట్టగా, కారులో ప్రయాణిస్తున్న వారు కూడా గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైనది ఎస్.వి.కె.ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.






