- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్యా.. ఆత్మహత్యనా..?: చెరువులో బైకుకు తాళ్లతో కట్టిన రెండు మృతదేహాలు
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పలు అనుమానాలకు తావిచ్చింది. రెండు మృతదేహాలు అది కూడా బైకుకు కట్టి చెరువులో ప్రత్యక్షమయ్యాయి..

దివ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చిన్నగొల్లపాలెంలో జరిగిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పలు అనుమానాలకు తావిచ్చింది. రెండు మృతదేహాలు అది కూడా బైకుకు కట్టి చెరువులో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఇది హత్య.. ఆత్మహత్యా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చిన్నగొల్లపాలెం చెరువులో బైక్ కు తాళ్లతో కట్టిన మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బయటకు తీశారు. గ్రామానికి చెందిన మామఅల్లుళ్లు సుబ్బన్న, అయ్యప్పగా గుర్తించారు. వీరిద్దరు శనివారం నుంచి అదృశ్యమయ్యారు. చివరికి చెరువులో మృతదేహాలుగా కనిపించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే ‘‘ఈ ఘటన ఎలా జరిగింది.. ఎవరైనా హత్య చేశారా..?. మామఅల్లుళ్లు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా..? గతంలో వీరికి ఎవరితోనైనా గొడవలు జరిగాయా..?.. లేదా ఇద్దరి పొత్తులో అప్పులు చేశారు. అసలు వీరి బంధువులు ఎవరు..?. అసలేం జరిగి ఉంటుంది.’’ అని అనుమానాలు, ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి కేసు దర్యాప్తులో అసలు విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసును త్వరగా ఛేదిస్తామని పోలీసులు తెలిపారు. చూడాలి మరి విచారణ పూర్తి అయ్యే వరకు..






