ఏసీబీ రైడ్స్.. అడ్డంగా బుక్కైన జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-04 11:41:13  IST  )

కృష్ణా జిల్లాలో డ్రైనేజీ శాఖ ఉద్యోగిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు...

ఏసీబీ రైడ్స్.. అడ్డంగా బుక్కైన జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. రోజూ ఏదో ఓ చోట లంచగొండి ఆఫీసర్లకు చెక్ పెడుతోంది. ప్రభుత్వ సేవలకు బల్ల కింద చేతులు పెట్టే వాళ్లను పక్కాగా పట్టుకుంటోంది. తాజాగా కృష్ణా జిల్లా(Krishna District)లో ఓ అవినీతి అధికారిని వలపన్నీ మరీ పట్టుకుంది. గుడివాడ(Gudiwada)లో డ్రైనేజీ శాఖ ఈఈ కార్యాలయం(EE Office)లో పని చేసే జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు(Junior Assistant Srinivasa Rao) లంచం గుట్టును సోమవారం ఏసీబీ అధికారులు రట్టు చేశారు. డ్రైనేజీ బిల్లుల విషయంలో కాంట్రాక్టర్ రాజా నుంచి శ్రీనివాసరావు రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. అయితే ఏసీబీ అధికారులను రాజా ఆశ్రయించారు. ప్లాన్ ప్రకారం ముందుగా కార్యాలయంపై దాడి చేసి లంచం తీసుకుంటున్న శ్రీనివాసరావును అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం శాఖా పరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ అధికారుల లంచం డిమాండ్ చేయడం నేరమని, ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని ఏసీబీ అధికారులు హెచ్చరించారు.

Next Story