- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gudivada: లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సీఐ
by Vemula.Srinu Prasad |
గుడివాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు...

X
దిశ, డైనమిక్ బ్యూరో: గుడివాడ రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూరల్ సీఐ జయకుమార్ రూ. 75 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇటీవల గుడివాడలో జరిగిన సీఎం జగన్ పర్యటన సందర్భంగా గో బ్యాక్ సీఎం అంటూ మహిళా నేతలు చేసిన నిరసనకు, స్టిక్కర్లు ముద్రించాడన్న ఆరోపణపై ఇమేజ్ డిజిటల్స్ అధినేత కందుల రవిను, రూరల్ పోలీసులు కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నారు.
దీంతో సీఐ వేధింపులతో ఆందోళన చెందిన రవికుమార్ ఏసీబీను ఆశ్రయించగా అధికారులు విచారణ చేపట్టారు. ఓ కేసు విషయమై సీఐ జయకుమార్ రూ.75వేలు లంచం డిమాండ్ చేసినట్లు కందుల రవి ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహితకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. సీఐ జయకుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
Next Story






