ఇన్‌స్టాలో పరిచయం.. రెండేళ్లుగా సహజీవనం.. చివరికి ఒకరు సూసైడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-20 15:19:37  IST  )

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో యువతి ఆత్మహత్య కలకలం రేపింది...

ఇన్‌స్టాలో పరిచయం.. రెండేళ్లుగా సహజీవనం.. చివరికి ఒకరు సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట(Jaggaiahpet)లో యువతి(young woman) ఆత్మహత్య(suicide) కలకలం రేపింది. యువతి ప్రవల్లికకు యువకుడు సుభాష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. అయితే పెళ్లి చేసుకోకుండానే సహజీవనం చేస్తున్నారు. రెండేళ్లుగా వీరి జీవితం సాఫీగా సాగింది. అయితే సుభాష్ ఇటీవల ఇల్లు కొనుగోలు చేశారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇల్లును తన పేరుపై రిజిస్ర్టేషన్ చేయించాలని ప్రవల్లిక పట్టుబట్టారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో మనస్థాపం చెందిన పవల్లిక ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ప్రవల్లిక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రవల్లిక పేరుపై ఉన్న పొలాన్ని అమ్మాలని సుభాష్ వేధిస్తున్నారని తెలిపారు. తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులకు ప్రవల్లిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో సుభాష్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి ప్రవల్లికకు పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా ఇద్దరికి గతంలోనే పెళ్లి అయింది. భార్యను వదిలేసి సుభాష్.. భర్తను వదలేసి ప్రవల్లిక సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. అయితే ప్రవల్లికను తాను పెళ్లి చేసుకున్నానని సుభాష్ తెలిపారు.

Next Story