- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: గుంటూరు ఘటన మరువకముందే.. విజయవాడలో మరో ఘటన
విజయవాడ భవానీపురంలో అగ్నిప్రమాదం జరిగింది. మిక్సీల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి...

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ భవానీపురంలో అగ్నిప్రమాదం జరిగింది. మిక్సీల గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వేసవికి ఇంకా సమయం ఉన్నా భానుడు మాత్రం భగభగమంటున్నారు. ఉదయం 10 గంటల నుంచే సెగలు పుట్టిస్తున్నారు. మధ్యాహ్నం అయితే చాలు అగ్గి మీద గుగ్గిళం అయిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన జనాల మాడు పగలగొడుతున్నారు. నెత్తిమీద ఏమీలేకపోతే ఇక సుర్రుసుమ్మనిపించేస్తున్నాడు. అంతేకాదు అటు వ్యాపారులకు కూడా పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాడు. దుకాణాలు, గోడౌన్లు, షాపులు, పెద్ద స్టోరేజీలను అగ్నికి ఆహుతి చేసేస్తున్నారు. దీంతో అగ్నిప్రమాదాల రూపంలో సగటు వ్యక్తికి భారీ నష్టం మిగిలుస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. మిర్చియార్డులో ఉంచిన గోనె సంచులు మొత్తం తగలబడిపోయాయి. అంతేకాదు భారీ ఆస్తి నష్టం జరిగింది. తాజాగా విజయవాడ భవానిపురం మిక్సీల గోడౌన్‌లో ప్రమాదం చోటు చేసుకోవడంతో వ్యాపారులు, ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. మున్ముందు మరిన్ని అగ్నిప్రమాదాలు జరుగుతాయోమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






