‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అంటూ ప్రకటన.. నమ్మి కోట్లు పోగొట్టుకున్న విస్సన్నపేట వాసులు

by Vemula.Srinu Prasad |

ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో విస్సన్నపేటలో దంపతులు భారీ మోసానికి పాల్పడ్డారు..

‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’  అంటూ ప్రకటన..  నమ్మి కోట్లు పోగొట్టుకున్న విస్సన్నపేట వాసులు
X

దిశ, వెబ్ డెస్క్: ‘పెట్టుబడులు పెట్టండి.. లాభాలు పొందండి.. భవిష్యత్ మొత్తం మారిపోతుంది’ అంటూ అందమైన మాటలు చెప్పి ప్రజలను ఆకర్షించారు. రూ. 10,000‌లకు రూ. 1000.. రూ.లక్షలకు రూ. పదివేలు, ఐదు లక్షలకు యాబై వేలు అంటూ నమ్మబలికారు. కొద్ది రోజులు బాగానే కథ నడిపారు. కానీ కొన్ని రోజుల తర్వాత అసలు విషయం బయటపడింది. దాదాపు రూ. 25 కోట్లు వసూలు చేసి జనం నెత్తిన కుచ్చు టోపీ పెట్టారు. దీంతో బాధితులు లబోదిబోమన్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగింది.

విస్సన్నపేటలో దుర్గాప్రసాద్ దంపతులు ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అడ్వైరీ సర్వీసెస్’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. తమ సంస్థలో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రకటన ఇచ్చారు. ఏజెంట్లను నియమించారు. టార్గెట్లు పెట్టుకుని మరీ జనం నుంచి వసూలు చేశారు. 10 శాతం వరకు వడ్డీ చెల్లిస్తామని మభ్యపెట్టారు. దీంతో జనం అత్యాశకు పోయి దాదాపు రూ. 25 కోట్ల మేర డిపాజిట్లు కట్టారు. ఇందుకు కొంతకాలం వడ్డీ చెల్లించారు. అయితే ఈ మధ్య కాలం వడ్డీ చెల్లించడం మానేశారు. దీంతో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అడ్వైరీ సర్వీసెస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్‌ను డిపాజిట్లను ప్రశ్నించారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. భర్త చనిపోవడంతో భార్య శివానీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంోత మోసపోయిన తెలుసుకున్న బాధితులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Next Story