- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణా జలాల పంపిణీపై చర్చించాలి : ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు
కృష్ణా జలాల పంపిణీల్లో గందరగోళం కారణంగా ఏపీ నష్టపోతోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జలాల పంపిణీల్లో గందరగోళం కారణంగా ఏపీ నష్టపోతోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. ఆదివారం ఉదయం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీపై రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. అలాగే.. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)ను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఏపీలోనూ SIR ప్రక్రియ నిర్వహించాలని కోరారు. కాగా.. సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన అఖిలపక్ష సమావేశంలో .. శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు సహకరించాలని కేంద్రమంత్రులు విపక్షాలను కోరారు. పార్లమెంటులో చర్చించనున్న కీలక బిల్లులకు సంబంధించిన పత్రాలను వారికి అందించారు. డిసెంబర్ 1 నుంచి 19 వరకూ జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో 14 కీలక బిల్లులపై చర్చ జరగనుంది. అణుశక్తి బిల్లు, జాతీయ భద్రత, హెల్త్, ఇన్సూరెన్స్ బిల్లులపై కేంద్రం చర్చించనుండగా.. ఓట్ చోరీ, ఢిల్లీ పేలుళ్ల అంశాలపై సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.






