సాయికృష్ణ లాకప్ డెత్ కేసు : ఏసీపీ ఆఫీసులో లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్స్

by Naga Rani Yarlagadda |

రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

సాయికృష్ణ లాకప్ డెత్ కేసు : ఏసీపీ ఆఫీసులో లొంగిపోయిన హెడ్ కానిస్టేబుల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రౌడీ షీటర్ సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ రోజు ఉదయమే క్రైమ్ కానిస్టేబుల్ బాబురావును సిట్ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచగా.. సాయంత్రానికి మరో ఇద్దరు లొంగిపోయారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లు సూర్యారావు పేటలోని ఏసీపీ ఆఫీసులో లొంగిపోయారు. దీంతో కేసు కీలక మలుపు తిరిగింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అసలు సాయికృష్ణ చనిపోయిన రోజున ఏం జరిగింది? అతని మృతదేహం ఏం చేశారు? అనే విషయాలపై ఇద్దరినీ విచారిస్తున్నట్లు సమాచారం. వీరిద్దరి లొంగుబాటుతో ఈ కేసులో నిందితుల సంఖ్య నాలుగుకు చేరింది.

కొద్దిరోజుల క్రితమే కృష్ణలంక పీఎస్ సస్పెండెడ్ సీఐ నాగరాజును ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసు హాట్ టాపిక్ గా మారడం, రాజకీయంగా చర్చకు దారితీయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై సిట్ వేసింది. అప్పటి నుంచి దర్యాప్తు వేగవంతమయింది. సీఐ నాగరాజు, కానిస్టేబుల్ బాబురావు, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని లే కాకుండా.. ఆరోజున స్టేషన్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్నదానిపై కూపీ లాగుతున్నారు.

Next Story