- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈసారి అధికారం మాదే.. వారిని వదలిపెట్టం: దేవినేని అవినాశ్ స్ట్రాంగ్ వార్నింగ్
జగన్ కన్నా మంచి పరిపాలన చేస్తామని నమ్మించి చంద్రబాబు ప్రజను మోసం చేశారని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: జగన్(Jagan) కన్నా మంచి పరిపాలన చేస్తామని నమ్మించి చంద్రబాబు(Chandrababu) ప్రజను మోసం చేశారని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్(Devineni Avinash) అన్నారు. విజయవాడ NTR విగ్రహం సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దేవినేని అవినాశ్ మాట్లాడుతూ హామీలు అమలు చేయటానికి తమది బాధ్యత అని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలకు బాండ్ పేపర్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ బాండ్ పేపర్లు ఏమి చేయాలని, ఎక్కడ పెట్టుకోవాలి అని ప్రజలు నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని అని ప్రజలు ప్రశ్నస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన మోసం అర్థమయి జగన్‌ను ఎందుకు ఓడించామని బాధపడుతున్నారని తెలిపారు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా జగన్‌ను మళ్లీ ఎప్పుడు గెలిపించుకుందామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇంటిదగ్గరకు వచ్చి రేషన్ అందించే వాహనాలను తీసివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు లేవని విమర్శించారు. సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో ఏమీ జరగలేదని దేవినేని అవినాశ్ అసహనం వ్యక్తం చేశారు.
‘‘ఐఏఎస్ ఐపీఎస్‌లు తేడా లేకుండా అందరిపై కక్ష సాధింపూ చర్యలకు దిగుతున్నారు. చేసిన మోసాలపై మెమొరాండం ఇద్దామని వస్తే ఎమ్మార్వో సెలవు పెట్టి వెళ్ళిపోయారు. రాబోయే కాలంలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. తప్పు చేసిన ఏ అధికారిని, నాయకుడిని వదిలేది లేదు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలి.’’ అని దేవినేని అవినాశ్ డిమాండ్ చేశారు.






