కృష్ణలంక సీఐనే నా చావుకు కారణం: క్రాంతి కుమార్ సెల్పీ వీడియో

by Vemula.Srinu Prasad |

తన చావుకు కృష్ణలంక సీఐ నాగరాజునే అని క్రాంతి కుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు..

కృష్ణలంక సీఐనే నా చావుకు కారణం: క్రాంతి కుమార్ సెల్పీ వీడియో
X

దిశ, వెబ్ డెస్క్: తన చావుకు కృష్ణలంక సీఐ నాగరాజు(Krishnalanka Ci Nagaraju)నే అని క్రాంతి కుమార్ అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సీఐ నాగరాజు మూడు నెలలుగా తనను వేటాడి, వెంటాడి కొడుతూ, వేధిస్తున్నారని, ఇంక తాను బతకలేనంటూ విష గుళికలను ఆయన మింగేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరోవైపు సీఐ నాగరాజును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారంలో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఇది బుధవారం సాయంత్రం జరిగింది. ఈ రోజు యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం చర్చగా మారింది. అయితే క్రాంతి కుమార్ - సీఐ నాగరాజు మధ్య అసలేం జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఐ వేధింపులకు అసలు కారణాలేంటని ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలు బయటకు తెలియాలని అంటున్నారు. అసలు క్రాంతి కుమార్ ఎవరు..?. ఆయన్ను పోలీసులు ఎందుకు కొడుతున్నారనేది తెలియాల్సి ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. అసలు దీనంతటి వెనుక ఉన్న అసలు నిజాలు తెలియాలని కోరుతున్నారు.

Next Story