- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబు కాదు.. జగన్ బావిలో దూకాలి: కోటంరెడ్డి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ( YS Jagan Mohan Reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotamreddy Sridh

దిశ, వెబ్ డెస్క్ : వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ( YS Jagan Mohan Reddy) నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( Kotamreddy Sridhar Reddy) హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు ( Chandrababu) కాదు.. జగన్ బావిలో దూకాలని ఫైర్ అయ్యారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. గతంలో హెలికాప్టర్ వద్ద తోపులాట జరిగితే పోలీసుల వైఫల్యం అన్నారని ఆగ్రహించారు.
ఇప్పుడు ముందస్తు చర్యలు తీసుకుంటే ఆంక్షలు అంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును బావిలో దూకాలని జగన్ అన్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ బావిలో దూకాలని చురకలు అంటించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ముఖ్యమంత్రికి కూడా ఇవ్వని భద్రత పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు ఇస్తున్నామన్నారు. జగన్ మోహన్ రెడ్డి పర్యటనలకు పర్మిషన్లు ఇస్తున్నాం, భద్రత కల్పిస్తున్నామని వెల్లడించారు.






