- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: అనుచరులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యవసర భేటీ.. హత్య వీడియోపై ఆగ్రహం
అనుచరులతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అత్యవసర భేటీ అయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Nellore Rural, MLA Kotamreddy Sridhar Reddy) హత్యకు ప్లాన్ చేస్తూ రౌడీషీటర్లు(Rowdysheeters) మాట్లాడుకున్న వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించేందుకు నిరాకరించారు. నెల్లూరు రూరల్ టీడీపీ(TDP) కార్యాలయంలో తమ్ముడు గిరిధర్ రెడ్డితో పాటు అనుచరులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. తనను చంపుతామని వీడియో విడుదలై 5 రోజులు అవుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదనే ప్రశ్నలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నుంచి వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనుచరులతో ఇదే విషయంపై చర్చిస్తున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం పోలీసులపై ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. పోలీసులు విచారణ చేపట్టినా సహకరించనని అనుచరులతో చెప్పినట్లు సమాచారం. వీడియో విడుదలై 5 రోజులు అవుతున్నా తననెందుకు పోలీసులు అలర్ట్ చేయలేదని మండిపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే‘‘రౌడీ షీటర్ల మధ్య జరిగిన సంభాషణ వెనుక ఎవరైనా ఉన్నారా..?, వీళ్ల మధ్యే జరిగిందా..? కోటంరెడ్డిని చంపే అలోచన వెనుక ఉన్నది ఎవరు..?. ఈ అంశం వెనుక ఎంత మంది ఉన్నారు.?. అసలు ఈ వీడియోలు ఎవరు రికార్డు చేశారు. ఆ రూమ్‌లో ఏడుగురు రౌడీషీటర్లు ఎవరు..?.’’ అనే అంశాలు మాత్రం పలు సంచలనంగా మారాయి.






