- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోట వినుత చిల్లర రాజకీయాలు చేస్తోంది.. బొజ్జల సుధీర్ హాట్ కామెంట్స్
జనసేన (Janasena) నుంచి సస్పెన్షన్‌కు గురైన కోట వినుత (Kota Vinutha), భర్త కోట చంద్రబాబును చంపేందుకు బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి కుట్ర చేసినట్లుగా చనిపోయిన డ్రైవర్ శ్రీనివాసులు సెల్ఫీ వీడియో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: జనసేన (Janasena) నుంచి సస్పెన్షన్‌కు గురైన కోట వినుత (Kota Vinutha), భర్త కోట చంద్రబాబును చంపేందుకు బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి కుట్ర చేసినట్లుగా చనిపోయిన డ్రైవర్ శ్రీనివాసులు సెల్ఫీ వీడియో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. వినుత దంపతులను హత్య చేసేందుకు ఎమ్మెల్యే రూ.30 లక్షలు ఒప్పందం కుదుర్చుకుని.. ముందస్తుగా రూ.20 లక్షలు ఇచ్చారని రాయుడు తన సెల్ఫీ వీడియోలో చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. అదేవిధంగా జైలు నుంచి విడుదలైన వినుత కూడా రాయుడిని చంపించింది ఎమ్మెల్యేనే అని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనపై వస్తున్న ఆరోపణలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి (Bojjala Venkata Sudheer Reddy) ఫస్ట్ టైమ్ మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోట వినుత డ్రైవర్ హత్య గురించి అందరితో పాటే తనకు తెలిసిందని అన్నారు. రాయుడికి సంబంధించిన వీడియోను తాను కూడా నిన్ననే చూశారని తెలిపారు. ఆ వీడియోను బెదిరించాక తీయించారా లేక.. ఫేక్ వీడియోనా అనేది తెలియాలన్నారు. కోట వినుత ఏరోజు కూడా తమకు సహరించలేదని అన్నారు. ఇలాంటి చెత్త రాజకీయాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు చేయించాలని వెంకట సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కోట వినుత చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, బెయిల్ వచ్చిన వాళ్లంతా నిర్దోషులు కాదని కామెంట్ చేశారు. రాయుడి వీడియోనే నిజమైతే ఎన్ని చిత్రహింసలు పెట్టి తీయించారో పోలీసులు తేల్చాలని ఎమ్మెల్యే బొజ్జల వెంటక సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు.






