- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ కస్టడీకి కొండలరావు
అగ్నిమాపక శాఖ మాజీ డీజీ బిక్కిన కొండలరావును నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ అధికారులు వరుసగా మూడో రోజు విచారించారు.

దిశ, వెబ్ డెస్క్ : అగ్నిమాపక శాఖ మాజీ డీజీ బిక్కిన కొండలరావును నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ అధికారులు వరుసగా మూడో రోజు విచారించారు. బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్న అధికారులు, ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేసిన కాలంలో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో కొండలరావు ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఆరోపణలకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ఏసీబీ బృందం కొండలరావును లోతుగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన విజయవాడలోని జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సంజయ్ కూడా విజయవాడ జిల్లా జైలులోనే రిమాండ్‌లో ఉన్నారు. యాప్ డిజైనర్‌గా పేర్కొనబడిన కొండలరావును ఈ కేసులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది.
బిక్కిన కొండలరావు కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ పూర్తయిన నేపథ్యంలో అధికారులు ఈ రోజు తిరిగి ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిధుల దుర్వినియోగం ఆరోపణల కేసుపై పూర్తి వివరాలను అధికారులు కోర్టుకు సమర్పించనున్నారని సమాచారం.
మద్యం కుంభకోణంలో..
ఏపీ మద్యం కుంభకోణంలో నిందితుడైన అనిల్ చోక్రాను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ జైలు నుంచి సిట్ అధికారులు అతడిని ఏసీబీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు. కేసులో ఏ49గా ఉన్న అనిల్ చోక్రాను గత రెండు రోజులుగా సిట్ అధికారులు పలు ప్రశ్నలతో ముంచెత్తారు. పలు కీలక విషయాలను నిందితుడి వద్ద నుంచి సిట్ అధికారులు రాబట్టారు.






