సంక్రాంతికి కోనసీమ అందాలు.. సర్ణాంధ్ర కాలేజీ నుంచి హెలికాప్టర్ రైడ్

by Naga Rani Yarlagadda |

సంక్రాంతి సంబరాలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరు తెచ్చుకున్నాయి గోదావరి జిల్లాలు. తెలంగాణ నుంచి కేవలం ఆంధ్రావాళ్లే కాదు.. తెలంగాణ లోకల్స్ కూడా సంక్రాంతి పండుగ కోసం గోదావరి జిల్లాలకు వెళ్తారు.

సంక్రాంతికి కోనసీమ అందాలు.. సర్ణాంధ్ర కాలేజీ నుంచి హెలికాప్టర్ రైడ్
X

దిశ, వెబ్‌డెస్క్: సంక్రాంతి సంబరాలకు కేరాఫ్ అడ్రస్ అనే పేరు తెచ్చుకున్నాయి గోదావరి జిల్లాలు. తెలంగాణ నుంచి కేవలం ఆంధ్రావాళ్లే కాదు.. తెలంగాణ లోకల్స్ కూడా సంక్రాంతి పండుగ కోసం గోదావరి జిల్లాలకు వెళ్తారు. సంక్రాంతి సీజన్లో జిల్లాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. అలా ఊళ్లకు వచ్చిన వారికి కోనసీమ అందాలను ఏరియల్ వ్యూలో చూపించేందుకు హైదరాబాద్ కు చెందిన విహాగ్ సంస్థ నరసాపురంలో హెలికాప్టర్ రైడ్ ను ఏర్పాటు చేస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల రోజుల్లో ఈ స్పెషల్ హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

ఈ సంక్రాంతిని జీవితంలో మరిచిపోకుండా మధుర అనుభూతుల్ని అందిస్తామని చెప్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుంచి హెలికాప్టర్ రైడ్ ప్రారంభం కానుంది. ప్రయాణంలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది ఆలయం, విశాలమైన సాగరతీరం, లైట్ హౌస్, గోదావరి పాయలు కలిసే అన్నచెల్లెళ్ల గట్టుతోపాటు కోనసీమ జిల్లాలోని పచ్చని కొబ్బరితోటల అందాలను తిలకించవచ్చు. ఒక్కొక్కరికి రైడ్ టికెట్ ధరను రూ.5000గా నిర్ణయించారు. సుమారు 25 నిమిషాల పాటు 25 కిలోమీటర్ల మేర హెలికాప్టర్లో విహరిస్తూ పర్యాటక ప్రాంతాలను వీక్షించవచ్చు.

Next Story