- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kollu Ravindra: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు.. పోసానిపై కొల్లు రవీంద్ర ఫైర్
నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra), పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)పై ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దని మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra), పోసాని మురళీకృష్ణ (Posani Murali Krishna)పై ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ (YCP) సోషల్ మీడియా (Social Media) వేదికగా టీడీపీ (TDP) నాయకులపై అనుచిత పోస్టులు, కామెంట్స్ చేసిందని మండిపడ్డారు. పోసాని అరెస్ట్ చట్టబద్ధంగానే జరిగిందని కామెంట్ చేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pavan Kalyan)పై ఆయన చేసిన వ్యాఖ్యలు మేము మర్చిపోలేదని అన్నారు. ఇక నుంచి సోషల్ మీడియా (Social Media)లో అనుచిత పోస్టులు పెట్టే వారిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.
ఐదేళ్లు అధికారంలో ఉండి వైసీపీ (YCP) నాయకులు విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సూపర్ సిక్స్ (Super Six) పథకాలను సమర్ధవంతంగా దశలవారీగా అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతినెలా 1వ తేదీనే లబ్ధిదారులకు ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతి (Amaravati), పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) పనులు చకచక కొనసాగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపేందుకు సీఎం చంద్రబాబు (CM Chandrababu) అహర్నిశలు కృషి చేస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు.






