- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ గుడిలో కన్నబిడ్డలను దేవుడికి అమ్మేస్తారు!
తమ కన్నబిడ్డలను గుడిలో దేవుడికి అమ్మేసి ఆ తర్వాత డబ్బులిచ్చి కొనుక్కునే దేవాలయం గురించి మీకు తెలుసా?. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా గొల్లలమామిడాల కోదండ రామాలయంలో ప్రతియేటా జరిగే ఈచారం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమ కన్నబిడ్డలను గుడిలో దేవుడికి అమ్మేసి ఆ తర్వాత డబ్బులిచ్చి కొనుక్కునే దేవాలయం గురించి మీకు తెలుసా?. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా గొల్లలమామిడాల కోదండ రామాలయంలో ప్రతియేటా జరిగే ఈచారం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా తల్లిదండ్రులు తమ కన్న బిడ్డలను ఈ గుడికి సమర్పింస్తారు. ఆ తర్వాత డబ్బులి ఇచ్చి తిరిగి వారే కొనుగోలు చేస్తారు.
ఇలా చేయడం ద్వారా తమకు తమ పిల్లలకు అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. 1889లో నిర్మించిన నాటి నుంచి ఈ దేవాలయంలో పిల్లలను గుడికి అమ్మేయడం అనే ఆచారం కొనసాగుతూ వస్తోందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఈ ఆలయంలో బిడ్డలను దేవుడికి అమ్మేసి కొనుగోలు చేసే ఆచారంతో పాటు ఇతర విశిష్టతలు కూడా ఉన్నాయి. సంతానం లేని వారికి ఈ గుడిలో మొక్కుకుంటే శ్రీరామచంద్ర ప్రభువు సంతాన భాగ్యం కలిగిస్తారని భక్తుల విశ్వాసం. ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణంలోని తలంబ్రాలను పరమాన్నం వండుకుని తినడం భక్తులు ఆనవాయితీగా ఆచరిస్తుంటారు.






