ఆయన మీద గౌరవంతో ఆమె కోరిక తీరుద్దాం.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   (  Updated:2024-02-24 04:18:14  IST  )

నారా భువనేశ్వరి గారు తన మనసులోని మాటను బయటపెట్టారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు

ఆయన మీద గౌరవంతో ఆమె కోరిక తీరుద్దాం.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నారా భువనేశ్వరి గారు తన మనసులోని మాటను బయటపెట్టారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన చంద్రబాబు గారికి రెస్ట్ అవసరమని నారా భువనేశ్వరి తన మనసులోని మాటను బయటపెట్టారని, స్వయానా చంద్రబాబు గారి భార్య తన భర్తకి రెస్ట్ ఇవ్వండి కోరుతుందని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ గారి బిడ్డ నారా భువనేశ్వరి గారని, ఆమె మనందరిని కోరింది కాబట్టి ఆయన మీద గౌరవంతో, భువనేశ్వరి గారి మీద గౌరవంతో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు చంద్రబాబు గారికి రెస్ట్ ఇవ్వాలని తెలిపారు. అంతేగాక జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఈ ఎన్నికలతో చంద్రబాబు పని అయిపోతుందని, ఈ రాష్ట్ర ప్రజలు 2024 లో ఆయనకు పర్మినెంట్ గా రెస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారని కొడాలి నాని అన్నారు.

Next Story