వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ!

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-05 12:18:38  IST  )

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) జూలై 2న విజయవాడ (Vijayawada) జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.

వల్లభనేని వంశీని పరామర్శించిన కొడాలి నాని.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ!
X

దిశ, వెబ్‌డెస్క్: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) జూలై 2న విజయవాడ (Vijayawada) జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ఆయన ఉంగుటూరు (Unguturu) మండలం తేలప్రోలు (Telaprolu) గ్రామంలోని తన సొంత ఇంటికి వెళ్లిపోయారు. వంశీ జైలు నుంచి విడుదలైన మొదలు ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, వైసీపీ నాయకులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ వల్లభనేని వంశీకి ఇంటికి మాజీ మంత్రులు పేర్ని నాని (Perni Nani), కొడాలి నాని (Kodali Nani) వెళ్లి పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్యంపై వాకబు చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, వైసీపీ నేతలపై అక్రమ కేసులు లాంటి విషయాలపై వారు చర్చించారు. అదేవిధంగా వల్లభనేని వంశీతో పాటు, అన్ని కేసుల్లో అరెస్ట్ ఆయన అనుచరులను కూడా కొడాలి నాని పలుకరించి బాగోగులు తెలుసుకున్నారు.

Next Story