- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైసీపీకి షాక్.. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు అరెస్ట్
by Naga Rani Yarlagadda |
వైఎస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) అనుచరుడిని గుడివాడ రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) అనుచరుడిని గుడివాడ రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. గుడివాడ నియోజకవర్గ వైసీపీ ప్రచార విభాగ అధ్యక్షుడిగా ఉన్న గంటా శ్రీనివాసరావు నకిలీ పోలీసు అవతారమెత్తి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని ఆట కట్టించారు. తాను సబ్ ఇన్‌స్పెక్టర్‌ను అంటూ మోటూరు గ్రామంలోని గంగానమ్మ దేవస్థాన పూజారి వెంకట రామయ్యని బెదిరించి, బలవంతంగా ఆలయ తాళాలను లాక్కుని వాటర్ బోర్, మోటార్ తీసుకెళ్లాడు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కొడాలి నాని అనుచరుడైన శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి.. BNS 319 (2), 308 (2), 351 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story






