కన్నతల్లిపై కత్తివేటు.. కలకలం రేపిన వీడియో!

by Thanuru Gopichand |

అతనిని నవమాసాలు తన గర్భంలో పెంచింది.. పురిటినొప్పులను పంటికింద భరించి ఈ లోకానికి పరిచయం చేసింది.

కన్నతల్లిపై కత్తివేటు.. కలకలం రేపిన వీడియో!
X

దిశ, డైనమిక్ ​బ్యూరో : అతనిని నవమాసాలు తన గర్భంలో పెంచింది.. పురిటినొప్పులను పంటికింద భరించి ఈ లోకానికి పరిచయం చేసింది... కడుపులో పెట్టుకుని పెంచింది. చివరికి ఆ కొడుకు తల్లిపై కత్తి వేటు వేశాడు.. రక్తం ధారలా కారుతున్నా వదలలేదు. అమ్మ అని గుర్తుందో లేదో.. అసలు విచక్షణ ఉందో లేదో.. కనీస మానవత్వం మరిచాడో ఏమో..? ఒక్కొక్క కత్తి వేటు.. ఆమె గుండెలపైనే కాదు.. ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరిపై పడింది.. అందరు గుండెలను పిండి వేసిన ఈ ఘటన నిన్న జరగగా ఈ వీడియో ఇప్పుడు వైరల్​అవుతోంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం గ్రామం లో అశోక్ నగర్ లో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ తల్లి చావు బతకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. జక్కుల నరసమ్మ అనే మహిళ రోడ్డు పక్కన చిన్నగా కూరగాయల షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తోంది. కొడుకు శివ అప్పులపాలై తల్లిని డబ్బుల కోసం పదేపదే వేధిస్తూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో తల్లి పైన కొడు కు దాడి చేశాడని పలువురు తెలిపారు. ఈ క్రమంలో కన్నతల్లిని మాట్లాడే పని ఉంది ఇంటికి రమ్మని పిలిచాడు. కర్కశంగా వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. తప్పించుకునేందుకు రోడ్డుపైకి రాగా కత్తితో బలంగా దాడి చేశాడు. ఈ ఘటనను గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. తల్లి నరసమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుతం ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Next Story