- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: కేఎల్ యూనివర్సిటీ చైర్మన్‌కు ఊరట.. ముందస్తు బెయిల్
కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు అయింది...

దిశ, వెబ్ డెస్క్: కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ(KL University Chairman Koneru Satyanarayana)కు ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు అయింది. న్యాక్ సభ్యులకు లంచం ఇచ్చారని ఆయనపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసింది. విచారణకు హాజరుకావాలని ఈ మేరకు ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఏపీ హైకోర్టు(AP High Court)ను సత్యనారాయణ ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ, సత్యనారాయణ తరపున వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం సత్యనారయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ధర్మాససాన్ని ఆయన తరపున లాయర్ కోరారు. మరోవైపు సత్యనారాయణకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ తరపున వాదనలు వినిపించారు. అయితే సత్యనారాయణ తరపున వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.






