ఆ సినిమాకు ఆదర్శం చంద్రబాబునే: కిరాక్ ఆర్పీ

by Vemula.Srinu Prasad |

హీరో అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమా దేశవ్యాప్తంగా ఎంత సూపర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు చంద్రబాబు నాయుడే ఇనిస్పిరేషన్ అని కిరాక్ ఆర్పీ తెలిపారు. ..

ఆ సినిమాకు ఆదర్శం చంద్రబాబునే: కిరాక్ ఆర్పీ
X

దిశ, వెబ్ డెస్క్: హీరో అర్జున్(Hero Arjun) నటించిన ‘ఒకే ఒక్కడు’(Oke Okkadu) సినిమా దేశవ్యాప్తంగా ఎంత సూపర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకు చంద్రబాబు నాయుడే(Chandrababu) ఇనిస్పిరేషన్ అని కిరాక్ ఆర్పీ(Kirak RP) తెలిపారు. మంగళగిరి కేంద్రకార్యాలయంలో నిర్వహించిన మహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని అర్జున్ ఒకే ఒక్కడు సినిమా చిత్రీకరించారని చెప్పారు. ఆ విషయం డైరెక్టర్ శంకర్, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల, ఎగ్జిబ్యూటర్లు కూడా చెప్పారని పేర్కొన్నారు. చంద్రబాబును అప్పట్లోనే తమిళులు ఆదర్శంగా తీసుకున్నారని కిరాక్ ఆర్పీ చెప్పారు.

Next Story