ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్లు వేయలేదు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కిమ్స్

by Vemula.Srinu Prasad |

ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్లు వేయలేదు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కిమ్స్
X

దిశ, వెబ్ డెస్క్: పీపీపీ విధానం(PPP system)లో మెడికల్ కాలేజీల(Medical Colleges)ను నిర్మించాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఈ మేరకు టెండర్లు సైతం నిర్వహించింది. అయితే ఒక్క ఆదోని మెడికల్ కాలేజీ(Adoni Medical College)కి మాత్రమే టెండర్లు వచ్చాయని, అదీ కూడా కిమ్స్ ఆస్పత్రి అని తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో కిమ్స్(KIMS) యాజమాన్యం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. తాము టెండర్లలో పాల్గొనలేదని స్పష్టం చేసింది. టెండర్లు వేయాలనే ఆలోచనే చేయలేదని తెలిపింది. ఆదోని మెడికల్ కాలేజీ నిర్మాణానికి బిడ్ దాఖలు చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పింది. అదంతా ప్రచారమేనని కిమ్స్ యాజమాన్యం కొట్టిపారేసింది. దీంతో ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలినట్లైంది.

Next Story