KGVB ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యే కూన రియాక్షన్ ఇదే

by Kema Shiva Kumar |

ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ (MLA Kuna Ravi Kumar) వేధింపులు తాళలేక కేజీబీవీ (KGBV) ప్రిన్సిపాల్‌ రేజేటి సౌమ్య (Rejeti Soumya) ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.

KGVB ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం.. ఎమ్మెల్యే కూన రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ (MLA Kuna Ravi Kumar) వేధింపులు తాళలేక కేజీబీవీ (KGBV) ప్రిన్సిపాల్‌ రేజేటి సౌమ్య (Rejeti Soumya) ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, ఎమ్మెల్యే తనను రెండు నెలలుగా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని, ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోతూ మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఆమెపై సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టడంతో సౌమ్య సూసైడ్ అటెంప్ట్ చేసింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా సౌమ్య ఆరోపణలపై ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవని కొట్టి పడేశారు. కొందరు మహిళలు చేసే ఆరోపణలు, ప్రవర్తన మహిళా లోకానికే సిగ్గుచేటని కామెంట్ చేశారు. ప్రతి వ్యవస్థలోనూ మంచి, చెడు ఉంటాయని అన్నారు. అసలు తాను సౌమ్యతో మాట్లాడిన సందర్భాలు లేవని అన్నారు. కావాలని తనపై ప్రత్యర్థులు కార్డును వాడుతున్నారని ఫైర్ అయ్యారు. విద్యార్థినుల అడ్మిషన్లకు అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, వారికి ఉపయోగించాల్సిన నిత్యావసర వస్తువులు మళ్లించడం వంటి అంశాలపై ప్రశ్నించినందుకు, ప్రిన్సిపల్ సౌమ్య, వైసీపీ నేతలతో కలిసి తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఒక నియోజకర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న తనకు అధికారులను ప్రశ్నించే హక్కు లేదా అని అన్నారు. జరిగిన తప్పులపై ప్రశ్నించకపోతే వ్యవస్థలు నాశనం అయిపోతాయని కూన రవికుమార్ అన్నారు.

Next Story