- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Govt:తల్లికి వందనం పథకం.. రెండో విడత పై కీలక అప్డేట్!
ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఇటీవల సూపర్ సిక్స్(Super six) హామీల్లో భాగంగా తల్లికి వందనం(Talliki Vandanam) పథకం అమలు చేసింది. ఈ నేపథ్యంలో 'తల్లికి వందనం' పథకం కింద ఇప్పటికే మొదటి విడత నిధులను మంజూరు చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమందికి విద్యార్థుల తల్లి ఖాతాలో ‘తల్లికి వందనం’ డబ్బులు జమ చేస్తున్నారు.
ఈ పథకంలో భాగంగా తల్లుల ఖాతాలో రూ.13వేలు జమ చేశారు. మిగతా రూ.2వేలను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కలెక్టర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా తల్లికి వందనం పథకం రెండో విడత పై కీలక అప్డేట్ వచ్చింది. తల్లికి వందనం పథకం రెండో విడత నగదును ఈ నెల(జూలై) 10వ తేదీన విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి విడతలో 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఇక, ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులకు రెండో విడతలో నగదు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే, రెండో విడత నగదును జూలై 5వ తేదీనే ఇస్తామని మొదటగా చెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇంకా కొనసాగుతున్నందున వాయిదా వేసింది.






