- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Free Bus : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి
ఏపీలో ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఆగస్టు 15వ తేదీన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Ram Prasad Reddy) తెలిపారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు.. ఈ శ్రీశక్తి పథకాన్ని (Sri Shakthi Scheme) ప్రారంభిస్తారని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఫ్రీ గా ప్రయాణం చేయవచ్చని తెలిపారు.
మహిళలు తమ ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించి ఫ్రీ జర్నీ చేయవచ్చని మంత్రి రాంప్రసాద్ వివరించారు. మొత్తం 6700 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, ఇందుకు రూ.1950 కోట్ల ఖర్చు అవుతుందన్నారు. అలాగే 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారని, రానున్న రెండేళ్లలో 1400 ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.






