లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. విచారణకు హాజరైన రిటైర్డ్ IAS రజత్ భార్గవ

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-11 09:21:53  IST  )

వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. విచారణకు హాజరైన రిటైర్డ్ IAS రజత్ భార్గవ
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు (Liquor scam case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న నాటి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ (Rajat Bhargava) ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. అదేవిధంగా తనతో పాటు హెల్త్ కండీషన్‌కు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లను వెంట తెచ్చుకున్నారు. కాగా, డిస్టిలరీలు (Distilleries), సరఫరా కంపెనీల నుంచి వైసీపీ లిక్కర్ గ్రూపుల నుంచి ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా అడ్డగోలు విధాన నిర్ణయాలు తీసుకుని, ఉత్తర్వులు ఇచ్చి ప్రభుత్వ ఖజానాకు రజత్ భార్గవ భారీగా గండి కొట్టారనే అభియోగాలు ఉన్నాయి. అదేవిధంగా కుంభకోణానికి సంబంధించిన కుట్ర, అమలులో రజత్‌ భార్గవ ప్రమేయంపై సిట్ అధికారులు కీలక అధారాలు కూడా లభించాయి. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో ఈ మాజీ ఐఏఎస్ పేరును అధికారులు ప్రస్తావించారు. దీంతో ఈ స్కామ్‌లో కీలక విషయాలు వెలికితీసేలా రజత్ భార్గవకు ప్రశ్నలు సంధించి సిట్ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనుంది.

Next Story