ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. రాజ్ కసిరెడ్డి పీఏ అరెస్ట్

by Malleboina Mahesh |

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసు మరో కీలక మలుపు తిరిగింది.

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు.. రాజ్ కసిరెడ్డి పీఏ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసు (Liquor scam case) మరో కీలక మలుపు తిరిగింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ బ్రాండ్లను తొలగించి, YSRCP నాయకులకు సంబంధం ఉన్న స్థానిక బ్రాండ్లు అయిన ఆంధ్ర గోల్డ్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్ విస్కీ వంటి వాటిని ప్రమోట్ చేయడంతో పాటు. కిక్‌బ్యాక్‌లు చెల్లించిన సరఫరాదారులకు మాత్రమే ఆర్డర్‌లు ఇచ్చారు. సిట్ విచారణలో ఈ స్కామ్ సుమారు ₹3,200 కోట్ల నుంచి ₹4,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా ఉంది. కాగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డీలను సిట్ ఇప్పటికే విచారించగా.. అత్యంత కీలకంగా మారిన రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి తో కలిసి కీలకంగా వ్యవహరించిన ఆయన పీఏను ఈ రోజు సిట్ అధికారులు (SIT officials) అరెస్ట్ చేశారు. చెన్నై ఎయిర్ పోర్టులో దిలీప్‌ (Dilip)ను అదుపులోకి తీసుకున్నారు. అతను కసిరెడ్డిని విచారిస్తున్న సమయంలోనే చెన్నై నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. ముందు నుంచి దిలీప్ పై కన్నెసిన సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించి దిలీప్ దగ్గర కీలక సమాచారం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేసి నేరుగా ఏపీకీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Next Story