- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతి తొక్కిసలాట ఘటన.. సీఎస్‌కు చేరిన కీలక రిపోర్ట్
ఏపీ(Andhra pradesh)లో కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల(Tirumala) కొండపై ఈ ఏడాది జనవరి 8వ తేదీన తొక్కిసలాట జరిగింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra pradesh)లో కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల(Tirumala) కొండపై ఈ ఏడాది జనవరి 8వ తేదీన తొక్కిసలాట జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం(AP Government) న్యాయ విచారణకు ఆదేశించింది.
తొక్కిసలాట ఘటన(Stampede incident) పై ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని నాడు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ జరిపిన అధికారులు తుది నివేదికను ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో తాజాగా తిరుపతి తొక్కిసలాట ఘటన పై సీఎస్ విజయానంద్‌కు(CS Vijayanandh) ఏకసభ్య కమిషన్ నివేదిక అందజేసింది. ఈ ఘటనపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయన సీఎస్ విజయానంద్ కు 200 పేజీల నివేదిక అందించారు. ఆ రిపోర్ట్ ఆయన రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించనున్నారు.






