- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CA కోర్సు నిబద్ధతతో కూడుకున్న విద్య: మంత్రి నారా లోకేష్
భారతదేశ మేధోశక్తికి వెన్నెముక ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

దిశ,వెబ్‌డెస్క్: భారతదేశ మేధోశక్తికి వెన్నెముక ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఐసీఏఐ స్థాపించి 76 సంవత్సరాలు నిండిన ఆ సంస్థ ఇప్పటికి యవ్వనంగానే ఉందన్నారు. గుంటూరు బండ్లమూడి గార్డెన్స్ లో ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో “స్పూర్తి” పేరుతో నిర్వహించిన మెగా సీఏ విద్యార్థుల సమావేశానికి మం మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతదేశం గర్వించదగిన ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కుటుంబ సభ్యులందరికీ మంత్రి లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘నేను చార్టర్డ్ అకౌంటెంట్ కాకపోయినా స్టాన్ఫోర్డ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్లు గా సిఎ ప్రాధాన్యత నాకు తెలుసు’ అని మంత్రి లోకేష్ అన్నారు. ఇది కేవలం ఒక కోర్సు కాదు, నిబద్ధత కూడుకున్న విద్య అని తెలిపారు.
ఐసీఏఐ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయ సంస్థగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో ఫోరెన్సిక్ అకౌంటింగ్ ప్రమాణాలతో పనిచేస్తున్న మొట్టమొదటి సంస్థ ఇది. ఐసీఏఐ ద్వారా 10 లక్షల మందికి పైగా చార్టర్డ్ అకౌంటింగ్ విద్యను అభ్యసిస్తుండగా, ప్రతిఏటా 2లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. 4.07 లక్షల మంది సభ్యులు, 54 విదేశీ చాప్టర్లు కలిగిన అతి పెద్ద సంస్థ ఐసిఎఐ. వ్యాపారం ఎక్కడ ఉంటే భారత్ అక్కడ ఉంటుంది, భారత్ ఎక్కడ ఉంటే అక్కడ ICAI ఉంటుంది.
మా కుటుంబ వ్యాపారాల్లో సీఎల కష్టాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వ్యాపారాల్లో స్పష్టత లోపించినపుడు మేము సీఎ వైపే చూస్తామని తెలిపారు. పాలనా వ్యవస్థలో బడ్జెట్ ఆమోదం ఉన్న ప్రతి ప్రభుత్వ ఫైల్‌కు ఆడిటర్ల ఆమోద ముద్ర అవసరం. వ్యవస్థపై నమ్మకం కోసం మేము చార్టర్డ్ అకౌంటెంట్‌పై ఆధారపడతాం అన్నారు. సీఏలు కేవలం సంఖ్యా విశ్లేషకులు మాత్రమే కాదు, వారు ఆర్థిక వృద్ధి చోదకులు. వారు వ్యాపారాలకు మూలధనాన్ని సేకరించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి సహాయం చేస్తారు. నేటి సీఏలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచవ్యాప్తంగా అవగాహన, AI ఆధారిత కమ్యూనికేషన్, నైతికత కలిగి ఉండాలని మంత్రి లోకేష్ సూచించారు.






