పార్టీకి పిలిచి కొట్టిన స్నేహితులు.. విశాఖ యువతి మృతి కేసులో కీలక విషయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-16 11:57:35  IST  )

విశాఖలో యువతి శాంతికుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీ పేరుతో పిలిచి స్నేహితులు కొట్టడంతోనే ఆమె మనస్థాపం చెందారు. ..

పార్టీకి పిలిచి కొట్టిన స్నేహితులు.. విశాఖ యువతి మృతి కేసులో కీలక విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో యువతి శాంతికుమారి ఆత్మహత్య(Suicide) చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీ పేరుతో పిలిచి స్నేహితులు కొట్టడంతోనే ఆమె మనస్థాపం చెందారు. పార్టీ అయిన తర్వాత శాంతి కుమారి(Shanti Kumari)తో ముగ్గురు యువకులు, ఇద్దరు అమ్మాయిలు గొడవ పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. పార్టీలో సాయి కిరణ్, లక్ష్మి సౌజన్య, జశ్వంత్ సహా మరో ఇద్దరు ఉన్నట్టు గుర్తించారు. మిత్రులు కొట్టారనే బాధతో శాంతికుమారి ఆత్మహత్య చేసుకుందని విశాఖ ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. మిత్రులతో కలిసి పుట్టినరోజు పార్టీకి శాంతికుమారి హాజరయ్యారని, ఆ తర్వాత మిత్రుల మధ్య గొడవ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలో శాంతికుమారిపై మిగతా స్నేహితులు దాడి చేశారని, ఈ బాధతోనే శాంతికుమారి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు యువకులు, ఒక యువతిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని ఏసీపీ నరసింహమూర్తి(ACP Narasimha Murthy) స్పష్టం చేశారు.

Next Story