- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసు శాఖలో కీలక పరిణామం.. భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ
ఆంధప్రదేశ్ పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధప్రదేశ్ పోలీసు శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య (Jayasurya)పై అక్రమ జూదం, సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవడం వంటి ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించి విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే ఓ వైపు విచారణ కొనసాగుతుండగానే తాజాగా డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు.
కాగా, డీఎస్పీ జయసూర్య భీమవరంలో సుమారు ఏడాది నుంచి డీఎస్పీగా పనిచేస్తున్నారు. పేకాట శిబిరాలకు మద్దతు, ప్రైవేటు సెటిల్మెంట్లు, ఆస్తి వివాదాల్లో పక్షపాతం చేయడం వంటి ఆరోపణలు జనసేన నేతల నుంచి వచ్చాయి. ఈ ఫిర్యాదులు పవన్ కళ్యాణ్‌కు చేరడంతో ఆయన పశ్చిమ గోదావరి ఎస్పీతో మాట్లాడి నివేదిక కోరారు. మరోవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghuramakrishnaraju) జయసూర్యను మంచి అధికారిగా ప్రశంసిస్తూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పేకాట సర్వసాధారణమని, ఆయనపై ఆరోపణలు పూర్తిగా రాజకీయమని రఘురామ అన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా జయసూర్యకు మద్దతు తెలిపారు.






