నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం.. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ అరెస్ట్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-22 03:53:01  IST  )

ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

నటి జెత్వానీ కేసులో కీలక పరిణామం.. ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై నటి కాదంబరీ జెత్వానీ (Kadambari Jethwani) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (Former AP Intelligence Chief PSR Anjaneyulu) ఇవాళ అరెస్ట్‌ అయ్యారు. ఈ మేరకు ఏపీ సీఐడీ (AP CID) అధికారులు ఆయనను హైదరాబాద్‌ (Hyderabad)లో బేగంపేట నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సర్కార్ (YCP Government) హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా విధులు నిర్వర్తించిన ఆయన మాజీ సీఎం జగన్‌ (Former CM Jagan)కు సన్నిహితంగా మెలుగుతూ.. ఆయన చెప్పిందల్లా చేస్తూ వచ్చారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముంబై నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)కి వైసీపీ పెద్దల వేధింపుల వ్యవహారంతో సంబంధం ఉన్న ముగ్గురు సీనియర్ ఐపీఎస్ (IPS)లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కాంతి రాణా టాటా (Kanthi Rana Tata), విశాల్ గున్నీ (Vishal Gunni)లతో పాటు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు (PSR Anjaneyulu) కూడా సస్పెన్షన్‌లోనే ఉన్నారు. అదేవిధంగా జెత్వానీ కేసు విచారణను సీఐడీ (CID)కి అప్పగిస్తూ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. జెత్వానీ కేసులో పూర్తి స్థాయిలో ఆయనను విచారించనున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, విజయవాడ (Vijayawada)లో ముంబై సినీ నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)పై గతేడాది కేసు నమోదైంది. వైసీపీ (YCP) నేత విద్యాసాగర్‌ (Vidya Sagar)పై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడానికే తనపై ఆ కేసు పెట్టారని నటి ఆరోపించింది. ఆ సమయంలో PSR ఆంజనేయులు ఇంటిలిజెన్స్ చీఫ్‌గా ఉండగా.. విజయవాడ సీపీగా కాంతిరాణా (Kanthi Rana), డీసీపీగా విశాల్ గున్నీ (Vishal Gunni) ఉన్నారు. వైసీపీ లీడర్ విద్యాసాగర్ ఫిర్యాదుతో నటితో పాటుగా ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై కూడా కేసు నమోదు చేశారు. గతేడాది ఫిబ్రవరి 2న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు చేశారు. ఫిబ్రవరి 3న ముంబైలో నటితో పాటుగా, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తీసుకురాగా.. ఆమెపై నమోదైన కేసు 2024 ఆగస్టు 26న బయటపడింది. అనంతరం జెత్వానీ స్వయంగా విజయవాడ వచ్చి విజయవాడ CP రాజశేఖర్‌బాబు (Rajashekara Babu)ను కలిసి ఫిర్యాదు చేయగా ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ సస్పెండ్ చేశారు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో వైసీపీ నేత విద్యాసాగర్, ఐపీఎస్ అధికారులపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రెండు కేసులను సీఐడీ (CID) దర్యాప్తు చేస్తోంది. కేసు దర్యాపును వేగవంతం చేయాలని ఇటీవలే జెత్వానీ సీపీని కలిసి విన్నవించిన నేపథ్యంలోనే ఇవాళ సీఐడీ అధికారులు ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ అవుతోంది.

Next Story