కొనసాగుతున్న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. వీటికి ఆమోదం

by Naga Rani Yarlagadda |

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.

కొనసాగుతున్న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం.. వీటికి ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం కొనసాగుతోంది. 87 అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సుమారు నాలుగు గంటలుగా సమావేశం జరుగుతోంది. టీటీడీ వార్షిక బడ్జెట్ పై ధర్మకర్తల మండలి సూచనలు, నిర్ణయాలపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తిరుమలలో అధునాతన హంగులతో నూతన అదనపు అన్నదాన భవనాన్ని ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు రాగా.. దానిపై కీలకంగా చర్చిస్తున్నారు. అలాగే.. ఒంటిమిట్ట కోదండరామ కల్యాణానికి వచ్చే భక్తులకు లడ్డూలను పంపిణీ చేసేందుకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే అక్కడ 108 అడుగుల ఎత్తయిన జాంబవంతుడి విగ్రహ ఏర్పాటుకు రూ.20.17 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీటీడీ విద్యాసంస్థల విద్యా ప్రమాణాల కోసం టీటీడీ రూ.116 కోట్లు వెచ్చించనుంది. అలాగే టీటీడీ వార్షిక బడ్జెట్ కు రూ.5,456 కోట్లకు ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని వకుళమాత ఆలయంలో గోవింద అక్షరమాల కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయించింది. 51 మంది అర్చకుల పదోన్నతి, నూతన టెక్నాలజీతో కానుకల సమర్పణ కోసం శ్రీవారి ముడుపుల పత్రం.. తదితర అంశాలపై టీటీడీ ధర్మకర్తల మండలి చర్చిస్తోంది.

Next Story