- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ కేబినెట్(AP Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ కేబినెట్(AP Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం సీఎం చంద్రబాబు(Chandrababu) అధ్యక్షతన జరిగిన ఈ భేటీ.. మూడున్నర గంటలపాటు సాగింది. సుమారు 70 అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. క్వాంటమ్ కంప్యూటరింగ్ విధానానికి, ఏపీ నైబర్‌హుడ్ పాలసీకి ఆమోదం లభించింది. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో 20 నుంచి 30 వర్క స్టేషన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలో ఐటీ కంపెనీలకు రోడ్డు విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. విశాఖలో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు, ఈ క్యాంపస్‌కు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని నిర్ణయించారు. ఫ్య్లూయెంట్‌గ్రిడ్ ఐటీ క్యాంపస్, దీనికి 3.3 ఎకరాలు కేటాయించారు. పేదలందరికీ ఇళ్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. నివాస స్థలం లేనివారి జాబితా రూపొందించి అందరికీ దక్కేలా చూడాలని చెప్పారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో చొరవ తీసుకోవాలని సూచించారు.






