- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్(AP Cabinet) సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్(AP Cabinet) సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధాన్యం కొనుగోలు కోసం రూ.700 కోట్ల రుణం తీసుకునేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వ హామీ ప్రతిపాదనపై కేబినెట్ అనుమతిస్తు నిర్ణయం తీసుకుంది. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ టారిఫ్ తగ్గింపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
నాగావళి నదిపై గౌతు లచ్చన్న, తోటపల్లి బ్యారేజీపై కుడి, ఎడమ వైపు మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించింది. కడప జిల్లా సీకే దిన్నె మండలంలో ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ఫ్రా కార్పొరేషన్‌కు కేటాయించిన 2595 ఎకరాల బదిలీకి స్టాంపు డ్యూటీ మినహాయింపు ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిషేధిత జాబితాలో పెట్టిన దాదాపు 7లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించింది. ఆ భూములను ఏం చేయాలన్నదానిపై మంత్రుల కమిటీ ఏర్పాటు కు నిర్ణయించింది.
కేబినెట్ భేటీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల రేషనలైజేషన్ ప్రతిపాదనపైన, రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ ఏర్పాటుపై చర్చించారు. అభ్యంతరాలు లేని స్థలాల రెగ్యులైజేషన్ పై చర్చించారు. సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించిన కేబినెట్ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా, రైతు భరోసా పథకాలను అమలుకు సిద్ధం కావాలని నిర్ణయించింది. పేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన 203 అన్న క్యాంటీన్ లకో తోడు మరో 62 అన్న క్యాంటీన్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం పీఎం కిసాన్ వేసిన వెంటనే ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. పోలవరం డయాఫ్రంవాల్ వెంటనే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.






