Government:రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా రెండు గ్రేడ్-2 మున్సిపాలిటీలు!?

by Jakkula.Mamatha |

రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Government:రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్తగా రెండు గ్రేడ్-2 మున్సిపాలిటీలు!?
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో పలు నగర పంచాయతీలు, మున్సిపాలిటీల స్థాయిని పెంచుతూ కూటమి ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో నగర పంచాయతీలుగా ఉన్న గిద్దలూరు, ఎర్రగుంట్ల గ్రేడ్ 2 మున్సిపాలిటీ(Grade 2 Municipality)లుగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నరసరావుపేట, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలను గ్రేడ్ 1 మున్సిపాలిటీ(Grade 1 Municipality)లుగా స్థాయి పెంచుతూ ప్రభుత్వం(AP Government) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తక్షణమే ఈ మార్పులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ వెల్లడించారు.

Next Story