నన్ను కలవడానికి కిరాయి మూకలు వస్తున్నాయి.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   (  Updated:2024-04-01 15:18:43  IST  )

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పిఠాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.

Janasena Chief Pawan Kalyan Demands Bharat Ratna for Pingali Venkayya
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పిఠాపురంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజూ నన్ను కలిసే వారిలో కొన్ని కిరాయి మూకలు ఉంటున్నాయి. వారు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని జనసైనికులకు సూచించారు. తనను కలవడానికి వస్తున్న వారిలో రోజూ 200 మందికి తాను ఫొటోలు ఇస్తున్నానని చెప్పారు. కానీ కొందరు బ్లేడ్ బ్యాచ్ వాళ్లు ఫ్యాన్స్ ముసుగులో వచ్చి తనను, సెక్యూరిటీ వాళ్లను చిన్నగా కట్ చేస్తున్నారని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయాన్ని కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్‌కు చెబుతామని అనుకుంటున్నా, మరిచిపోతున్నానని పవన్ తెలిపారు.

Read More..

AP: ఏపీలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల.. మహామహులు ఎన్నికల బరిలోకి!

Next Story