ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దు.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

by Gantepaka Srikanth |   (  Updated:2024-06-14 08:33:59  IST  )

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అమరావతిలో ఆ పార్టీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు.

ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దు.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అమరావతిలో ఆ పార్టీ ఎంపీలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కచ్చితంగా తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతామని అన్నారు. మన పాలన, చంద్రబాబు పాలనను ప్రజలు కచ్చితంగా గమనిస్తారని చెప్పారు. ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం అని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ప్రజల ముందు తలెత్తుకునేలా ఎంపీలు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిలా విజయసాయి రెడ్డి కొనసాగుతారని అన్నారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి కొనసాగుతారని స్పష్టం చేశారు. ఇక నుంచి తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ ధైర్యం కోల్పోకూడదు అని వెల్లడించారు.

Next Story