దేశానికి సరైన ప్రధాని దొరికారు.. దావోస్‌ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
దేశానికి సరైన ప్రధాని దొరికారు.. దావోస్‌ పర్యటనలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దావోస్‌(Davos)లో పర్యటిస్తున్నారు. మంగళవారం దావాస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో దేశానికి సరైన ప్రధాని దొరికారని అన్నారు. పరిపాలనపై మోడీ(PM Modi)కి స్పష్టత ఉందని కొనియాడారు. చాలా దేశాల్లో రాజకీయ సందిగ్ధత ఉంది.. కానీ, ఇండియాలో రాజకీయ సందిగ్ధత లేదని అన్నారు. ప్రధాని మోడీ దార్శనికత ఉన్న నాయకుడు అని చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు.. సీఐఐ కేంద్రం ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు.

టాటా సంస్థ(Tata Company)తో కలిసి అమరావతిలో సీఐఐ కేంద్రం(CII Centre) ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన లక్ష్యంగా సీఐఐ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. శిక్షణ, సలహా సేవలతో పరిశ్రమల్లో పోటీతత్వం నెలకొల్పుతామన్నారు. భారత్‌ 2047 విజన్‌ మేరకు ముందుకు సాగుతామన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక అన్ని రంగాలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ముఖ్యంగా సౌర విద్యుత్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. ప్రధాన మంత్రి సూర్యఘర్ కింద ఇంటింటికీ సౌర ఉత్పత్తి చేయాలని ఓ విధాన నిర్ణయం ప్రకటించారు. అలాగే పంప్డ్ స్టోరేజీ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిపైనా ఫోకస్ పెట్టినట్లు వెల్లడించారు. ఏపీలో విద్యుత్‌ ఉత్పత్తికి మంచి అవకాశాలున్నాయని అన్నారు.

Next Story

Most Viewed