- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో మహా అపచారం.. ప్రళయం తప్పదంటున్న కళాక్షేత్ర పీఠాధిపతి
తిరుమల(Tirumala) కొండకు వెళ్లే దారిలో అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల(Tirumala) కొండకు వెళ్లే దారిలో అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు(Sri Mahavishnu) విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మహావిష్ణువు విగ్రహాన్ని ఇలా చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన చెందారు. తక్షణమే టీటీడీ చైర్మన్, పాలకమండలి రాజీనామా చేయాలని, సీఎం, డిప్యూటీ సీఎం స్పందించాలని డిమాండ్ చేశారు. దీనిపై పాలకమండలి సభ్యులు సైతం స్పందించారు. భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనీశ్వరుడి విగ్రహానికి, శ్రీమహావిష్ణువు విగ్రహానికి తేడా తెలియకుండా భూమన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే.. ఇదిలా ఉంటే.. మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారన్న విషయం తెలుసుకుని అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామీజీ(Vijayashankara Swamiji) అక్కడకు వచ్చారు. ‘మహా విష్ణువుకు కోపం వస్తే ప్రళయం వస్తుంది. ఈ మహా అపచారం చేసినందుకు తిరుమల కొండపై ఉన్న అర్చకులు, పురోహితులు ఇక్కడికి వచ్చి పాప పరిహారం చేసి పునఃప్రతిష్టించాలి అని డిమాండ్ చేశారు. వీడియో






