Government:పాఠశాల విద్యలో కీలక మార్పులు.. ఇక పై ఒకే రోజు, ఒకే పాఠం

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-03 03:28:44  IST  )

ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది.

Government:పాఠశాల విద్యలో కీలక మార్పులు.. ఇక పై ఒకే రోజు, ఒకే పాఠం
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) విద్య వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ‘ఉపాధ్యాయుల కరదీపిక’ (టీచర్‌ హ్యాండ్‌ బుక్‌)ను ప్రవేశపెట్టింది. అయితే.. ఇప్పటివరకు ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళిక తయారు చేసుకుని దాని ఆధారంగా పాఠాలు చెప్పేవారు. కానీ.. ఇక నుంచి ఆ అవసరం లేదు. ఎస్‌సీఈఆర్‌టీ (State Council of Educational Research and Training) సహకారంతో సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా ‘సామర్థ్య ఆధారిత బోధన - అభ్యసన ఉపాధ్యాయ వనరు’ అనే పేరుతో సబ్జెక్టుల వారీగా కరదీపికలను తయారు చేశారు.

ఈ టీచర్ హ్యాండ్‌బుక్‌(Teacher Hand Book)లో ఏ రోజు ఏ ఛాప్టర్, ఏ టాపిక్‌ ఎలా చెప్పాలో తేదీలతో సహా పొందుపరిచారు. దీంతో అన్ని పాఠశాలల్లో ఒకరోజు, ఒకే పాఠం బోధించడం జరుగుతుంది. పాఠం పూర్తయిన తరువాత ప్రతి పీరియడ్‌లో బోధనా సమయం, ఉపయోగించిన టీఎల్‌ఎం(Teaching Learning Materials), అభ్యసన కృత్యాలు, రిమార్కులను టీచర్స్ ఆ కరదీపికలో రాయాలి. ఈ కరదీపికలను ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలకు అందజేస్తున్నారు. వీటి వినియోగం పై అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు. పిల్లలకు అర్థమయ్యేలా బోధించడం తేలికవుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

Next Story