Anantapur:TDP నేతలకు అధిష్ఠానం కీలక పిలుపు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది

Anantapur:TDP నేతలకు అధిష్ఠానం కీలక పిలుపు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. అనంతపురం(Anantapur) జిల్లాలోని టీడీపీ నేత(TDP Leader) సుధాకర్ నాయుడిని హత్య చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ప్లాన్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ హత్య కుట్రను ఏపీ పోలీసులు భగ్నం చేశారు. ఈ వ్యవహారం పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. టీడీపీ నేత పై హత్య కుట్ర కోణం ఘటన పై టీడీపీ అధిష్టానం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ నేపథ్యంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, టీడీపీ నేత సుధాకర్ నాయుడికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది.

టీడీపీ నేత సుధాకర్‌ను హత్య చేస్తామంటూ ఇటీవల బెదిరింపులు రావడంతో ఆయన జిల్లా ఎస్పీని కలిశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులపై సుధాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వారిద్దరు అమరావతికి రావాలని ఆదేశించింది. ఈ తరుణంలో వారిద్దరిని విచారించాలని టీడీపీ నేత కోవెలమూడి రవీంద్రకు సూచించింది. అయితే.. ఈ హత్య కుట్ర కోణం ఘటనను టీడీపీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరినీ విచారించిన అనంతరం టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Next Story