- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. పలు బిల్లులకు ఆమోదం తెలిపే చాన్స్!
అసెంబ్లీ (Assembly) వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ (Assembly) వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటలకు శాసనసభ, ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలను సభాధిపతులు ప్రారంభించనున్నారు. ఇక బ్రేక్ సమయంలో సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే విషయంపై బీఏసీ (BAC) సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పలు బిల్లులను ఆర్డినెన్స్‌ల రూపంలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం అసెంబ్లీలోని సమావేశ మందిరంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మంత్రులు, సీఎస్ విజయానంద్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV)కి ఆమోదముద్ర వేయనున్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీని ‘తాడిగడప పురపాలక సంఘం’గా పేరు మార్చే ప్రతిపాదనకు ఓకే చెప్పనున్నారు. ఇక పంచాయితీ రాజ్, మున్సిపల్ చట్ట సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్, నాలా చట్ట సవరణ, షెడ్యూల్ సబ్ కాస్ట్, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆర్డినెన్స్‌లకు కేబినెట్ ఆమోదం తెలిపి చట్ట సభల్లో ప్రవేశపెట్టనున్నారు.






