రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన

by Muthe.Rajitha |

ఏపీలో 'అన్నదాత సుఖీభవ పథకం'(Annadata Sukhibhav Scheme) విడుదల తేదీని ప్రకటించింది ప్రభుత్వం.

రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో 'అన్నదాత సుఖీభవ పథకం'(Annadata Sukhibhav Scheme) విడుదల తేదీని ప్రకటించింది ప్రభుత్వం. ఆగస్టు 2 నుంచి ఈ నిధులు విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆగస్టు 2న ప్రకాశం జిల్లాలోని దర్శి(Darshi) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ఈ పథకం రూపొందించబడింది. దీని కింద ఎంపికైన రైతులకు ఏటా రూ. 20,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది.

అయితే ఇందులో రూ. 6,000 కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) నుంచి అందిస్తుండగా.. మిగిలిన రూ. 14,000 రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఇస్తోంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,300 కోట్ల బడ్జెట్ కేటాయించింది. అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు, విత్తనాలు, ఎరువులు కొనడంలో ఎంతో ఉపయోగపడనుంది. అయితే ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' ఎన్నికల హామీలలో ముఖ్యమైనది.

Next Story