ఆప్షనల్ సెలవులు వారికి మాత్రమే.. విద్యాశాఖ కీలక ప్రకటన

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-06 08:48:04  IST  )

రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఆప్షనల్ సెలవులు వారికి మాత్రమే.. విద్యాశాఖ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రం(Andhra Pradesh)లోని ప్రభుత్వ పాఠశాల(Govt School)లను మెరుగుపరిచే విధంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే విద్యాశాఖ పై సమీక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఏపీ విద్యాశాఖ(Education Department) కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవుల(Optional Holidays) పై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు(Vijayaramaraju) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇవి స్కూళ్లు మొత్తానికి ఇచ్చేందుకు కాదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని, ఎవరైనా ప్రభుత్వ టీచర్లు ప్రైవేటు బడుల్లో కనిపిస్తే చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.

Next Story