AP Government: యువతలో AI నైపుణ్యాలకు మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందం

by Jakkula.Mamatha |   (  Updated:2025-03-13 14:51:00  IST  )

రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థైన మైక్రోసాఫ్ట్‌తో ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది.

AP Government: యువతలో AI నైపుణ్యాలకు మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి సంస్థైన మైక్రోసాఫ్ట్‌తో ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. ఏఐ, డిజిటల్ ప్రొడక్టివిటీలో ఏటా 2 లక్షల మందికి శిక్షణ ఇచ్చేలా మైక్రోసాఫ్ట్‌తో APSSD తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి సచివాలయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు.

వృత్తి విద్య, మాధ్యమిక పాఠశాల పిల్లలు, యువతలో ఏఐ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించి రాష్ట్రంలో ఐటీ ఆధారిత, ఇతర పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యవంతమైన సిబ్బందిని తయారు చేయడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది వ్యవధిలో 2లక్షల మంది యువతకు మైక్రోసాఫ్ట్ సంస్థ స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇస్తుందని తెలిపారు. అంతర్జాతీయంగా ఏఐ, అధునాతన టెక్నాలజీల్లో వస్తున్న అవకాశాలను అందిపుచ్చుకొని, ఉద్యోగావకాశాలు పొందేందుకు మైక్రోసాఫ్ట్ శిక్షణ ఉపకరిస్తుందని తెలిపారు.

50 ఇంజినీరింగ్ కాలేజీల్లో 500 మంది అధ్యాపకులకు మైక్రోసాఫ్ట్‌ శిక్షణ, 10వేల మంది విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటరింగ్ లో ట్రైనింగ్ ఇవ్వనుంది. అదే విధంగా 30 ఐటీఐల్లో 30 వేల మంది విద్యార్థులకు డిజిటల్ ప్రొడక్టివిటీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఏపీలో యునిసెఫ్ భాగస్వామ్యంతో పాస్ పోర్ట్ టు ఎర్నింగ్ 2.0ని ప్రవేశ పెట్టేందుకు వీలుగా 40వేల మందికి, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహకారంతో మరో 20 వేల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. ప్రభుత్వ పౌర సేవలను మెరుగుపర్చడంతో పాటు ప్రభుత్వాధికారుల్లో సామర్థ్యం పెంపుదలకు 50 వేల మందికి 100 గంటలపాటు AI శిక్షణను అందిస్తుందని తెలిపారు.

తద్వారా APSSDCతో సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తారు. శాఖల మధ్య సహకారంపై స్వీయ-అభ్యసన మార్గాలు, వర్క్‌షాప్‌లు, వెబినార్‌ల ద్వారా 20వేలమంది మంది సిబ్బందికి AI అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్‌ను అందిస్తారు. ఆయా ప్రాంతాల్లో AI శిక్షణకు అవసరమైన భౌతిక మౌలిక సదుపాయాలను ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సమకూరుస్తుంది. AI శిక్షణ అందించడానికి ఆయా విభాగాలను సమన్వయ పరుస్తుంది. విద్యాసంస్థల్లో AI పాఠ్యాంశాలను ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణ, సర్టిఫికేషన్ ను మైక్రోసాఫ్ట్ అందజేస్తుందని మంత్రి లోకేష్ చెప్పారు.

Read Also..

నన్ను ప్రపంచ బ్యాంక్ జీతగాడని అన్నారు.. సీఎం చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story