అమరావతిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

చంద్ర‌బాబు చేసిన గ‌ణ‌కార్యాన్ని రాయ‌ల‌సీమ రైతుల‌ను అడిగితే చెబుతార‌ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి విమ‌ర్శించారు. ప్ర‌తిపంట‌ల‌ను రైతులు రోడ్డుమీద వేసి అమ్మ‌లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని అన్నారు.

అమరావతిపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: చంద్ర‌బాబు చేసిన గ‌ణ‌కార్యాన్ని రాయ‌ల‌సీమ రైతుల‌ను అడిగితే చెబుతార‌ని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట్రామిరెడ్డి విమ‌ర్శించారు. ప్ర‌తిపంట‌ల‌ను రైతులు రోడ్డుమీద వేసి అమ్మ‌లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని అన్నారు. చంద్ర‌బాబు ప్ర‌తిది త‌నే క‌నిపెట్టాన‌ని చెప్పుకుంటాడ‌ని, సైబ‌రాబాద్, ఆర్టిఫీషియ‌ల్ ఇంటిలిజెన్స్ అంటాడ‌ని కానీ అమ‌రావ‌తిలో ఏ వ్యాలీ ఉండ‌దన్నారు.

క్వాంటామ్ వ్యాలీ అని అంటున్నాడ‌ని అక్క‌డ ఏ వ్యాలీ ఉండ‌ద‌ని ఒక ఆక్వా వ్యాలీ మాత్ర‌మే ఉంటుందని చెప్పారు. అక్క‌డ ఫిష‌రీస్ మాత్రం భాగా అభివృద్ధి చెందుతాయ‌ని అన్నారు. అంత‌కుమించి అమ‌రావ‌తిలో ఏదీ పురోగ‌తి ఉండ‌ద‌న్నారు. పవన్ కల్యాణ్ తన మీటింగుల్లోనే చెప్పాడని, తను అడ్మినిస్ట్రేటర్ కాదని పోరాటాలు మాత్రమే చేయగలనని చెప్పాడన్నారు. కాబట్టి అతన్ని ఒక ఆయుధంలా వాడుకుంటున్నారని చెప్పారు. పవన్ కల్యాణ్ గురించి అభిమానులకు కూడా అర్థం అయ్యిందని కాబట్టి ఆయన కచ్చితంగా జీరో అవుతారని అన్నారు.

Next Story